కన్నాయిగూడెం: మైనర్లకు పెళ్లి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పుష్పవతి అన్నారు. ఈ మేరకు బాల్య వివాహ రహిత గ్రామ పంచాయతీగా మండల పరిధిలోని ఐలాపూర్ ఎంపికై ందని, రెండేళ్లుగా గ్రామంలో బాల్య వివాహాలు నమోదు కాలేదని తెలిపారు. ఈ మేరకు మండల పరిధిలోని ఐలాపూర్‌లో బుధవారం ఐసీడీఎస్ అధికారులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్ధాలు, నష్టాలను ప్రజలకు వివరించారు. మేజర్లకు మాత్రమే వివాహాలు చేయాలని వెల్లడించారు. ఆడపిల్లలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహాలు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి మైనర్లకు వివాహాలు చేస్తే రెండేళ్ల జైలుశిక్షతో పాటు లక్ష రూపాయల జరిమాన ఉంటుందని హెచ్చరించారు. అనంతరం జిల్లా బాలల ప్రొటెక్షన్ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీరీల సురేశ్, యాలం రాజ్యలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్ జయలక్ష్మి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పుష్పవతి


