వాజేడు: పేద ప్రజలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అంతకు ముందు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మించిన వ్యాపార సముదాయ గదులను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం మండల పరిధిలోని ఇసుక వాగు వద్ద జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఎప్పటిలోగా పనులు పూర్తి అవుతాయని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రాంత్, విశ్వనాథప్రసాదరాజు, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు


