● సినీహీరో సంజోష్
ఏటూరునాగారం: యువత క్రీడల్లో రాణించాలని సినీ హీరో, సంజోష్ ఫౌండేషన్ అధినేత సంజోష్ అన్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. శ్రీడ్రగ్స్ వద్దు – క్రీడలు ముద్ద్ఙు అనే వినూత్న నినాదంతో జిల్లాకు చెందిన సినీహీరో సంజోష్ ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహించారు. ఏజెన్సీ పరిధిలోని వెంకటాపురం(కె), వాజేడు, ఏటూరునాగారం, మంగపేట మండలాల నుంచి మొత్తం 8 అగ్రశ్రేణి జట్లు ఈ టోర్నమెంట్‌లో తలపడ్డాయి. బుధవారం నిర్వహించిన హోరాహోరీ ఫైనల్ పోరులో అద్భుత ప్రతిభ కనబర్చిన వెంకటాపురం(కె) హంటర్స్ జట్టు ఘన విజయం సాధించి టోర్నమెంట్ ఛాంపియనన్‌గా నిలిచింది. రన్నరప్‌తో సరిపెట్టుకున్న మరో జట్టు గట్టి పోటీని ఇచ్చింది. గెలుపొందిన విజేత జట్టుకు, హంటర్స్ జట్టుకు రూ.30వేల నగదుతో పాటు ట్రోఫీని, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు ద్వితీయ బహుమతి కింద రూ.15వేల నగదును అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, రామన్నగూడెం సర్పంచ్ గద్దల నవీన్ పాల్గొన్నారు.


