వ్యాపార సముదాయాలకు టెండర్లు | - | Sakshi
Sakshi News home page

వ్యాపార సముదాయాలకు టెండర్లు

May 28 2026 12:34 AM | Updated on May 28 2026 12:34 AM

వ్యాపార సముదాయాలకు టెండర్లు చెక్కుల పంపిణీ ‘చర్య తీసుకోవాలి’ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

వాజేడు: ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్మించిన వ్యాపార సముదాయాలకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీకాంత్‌ నాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు అద్దెకు ఇవ్వడంకోసం నాలుగు గదులను నిర్మించినట్లు తెలిపారు. 29లోగా టెండర్‌ షెడ్యూల్‌ తీసుకొని 30లోగా సాయంత్రం 5 గంటలలోగా టెండర్‌ సమర్పించాలని తెలిపారు. 31 తారీకున డ్రా తీసి గదులను కేటాయించనున్నట్లు వెల్లడించారు. టెండర్‌ ఫారం రూ.2000, దరఖాస్తు సొమ్ము రూ.5000 డీడీ తియ్యాలని తెలిపారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

వెంకటాపురం(కె): మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు బుధవారం కాంగ్రెస్‌ నాయకులు అందజేశారు. పీఏసీఎస్‌ అధ్యక్షుడు చిడెం మోహనరావు, మండల అధ్యక్షుడు సయ్యద్‌ హుస్సేన్‌, చిట్టెం సాయి, బాలసాని వేణు, తదితరులు ఉన్నారు.

సన్మానం

కాళేశ్వరం: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచా తాలూకా జానం పల్లె గ్రామానికి చెందిన గండ్రకోట సంపత్‌ 14 సంవత్సరాలుగా పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల నిర్వహించిన ఎస్సై పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎస్సైగా ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం మహదేవపూర్‌ మండలం రాపల్లి కోట గ్రామానికి తన అత్తమామలను కలవడానికి వచ్చిన సందర్భంగా రాపల్లి కోట యాదవ సంఘం బాధ్యులు సంపత్‌–స్రవంతి దంపతులకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. యాదవ సంఘం మండల అధ్యక్షుడు పంచక మల్లేష్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

చిట్యాల: రైతుల కష్టాన్ని అసరాగా చేసుకుని ధాన్యం కొనుగోలు పేరుతో మోసం చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని బీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను మార్కెట్‌కు తీసుకొస్తే ఇక్కడ దళారులు రైతులను మోసం చేస్తు మార్కెట్‌ కంటే ఎక్కువ ధర చెల్లిస్తామని నమ్మించి ధాన్యాన్ని తీసుకుని రోజుల తరబడి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

చిట్యాల: మండలంలోని గిద్దెముత్తారం గ్రామంలో పని చేస్తున్న ఉపాధిహామీ కూలీలకు మాజీ సర్పంచ్‌ పోలవేన పోశాలు, మాజీ ఎంపీటీసీ పప్పుల విజయలక్ష్మీ సంజీవయ్య బుధవారం మజ్జిక ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కూలీలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement