ములుగు రూరల్: అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడే ప్రాణదాతలు అంబులెన్స్ పైలట్లని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ పైలట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులను సమయానికి ఆస్పత్రికి చేర్చడంలో పైలట్ల పాత్ర అభినందనీయమని తెలిపారు. రోగులను సమయానికి ఆస్పత్రులకు చేర్చి ప్రాణదాతలుగా నిలుస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈఎంఈ రాజ్‌కుమార్, 108 పైలెట్లు, ఈఎంటీలు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు


