జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అన్ని కొనుగోలు కేంద్రాల్లో వేగంగా కొనుగోళ్ల ప్రక్రియ సాగుతోంది. ప్రస్తుతం 150 లారీలతో నిరంతరంగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నాం. అవసరమైతే అదనపు లారీలు కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు కొనసాగుతున్నాయి.
– కృష్ణవేణి, సివిల్ సప్లయీస్ డీఎం


