ఆర్డీఓ సేవలు ప్రశంసనీయం | - | Sakshi
Sakshi News home page

ఆర్డీఓ సేవలు ప్రశంసనీయం

May 27 2026 6:14 AM | Updated on May 27 2026 6:14 AM

ములుగు: జిల్లా అభివృద్దిలో ఆర్డీఓ వెంకటేశ్‌ సేవలు ప్రశంసనీయమని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు తెలిపారు. జిల్లాలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న వెంకటేశ్‌ను మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ మహేందర్‌ జీ అధ్యక్షతన ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వెంకటేశ్‌ జిల్లాలో సమర్థవంతమైన పరిపాలన అందించారని ప్రశంసించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, రెవెన్యూ పరిపాలన, మేడారం మహాజాతర నిర్వహణలో సమన్వయంతో వ్యవహరించారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం తో విధులు నిర్వహించారని వెల్లడించారు. అదే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల గురించి చాటి చెప్పేందుకు ‘ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ రీల్స్‌ కాంపిటీషన్‌’లో పాల్గొనాలని ఇన్‌ఫ్లుయెన్సర్స్‌, మీడియా ప్రతినిధులు, కంటెంట్‌ క్రియేటర్లు, సోషల్‌ మీడియా హ్యాండ్లర్లకు కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామప్ప, మేడారం, లక్నవరం, బొగత జలపాతం ప్రకృతి అందాలపై రీల్స్‌ రూపొందించి పంపాలని కోరారు. డీపీఆర్‌ఓ రఫీక్‌ 99483 92976, సహాయ పౌర సంబంధాల అధికారి వేణు 94949 70535 నంబర్లకు వాట్సాప్‌ ద్వారా 30వ తేదీలోపు పంపించాలన్నారు.

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

Advertisement
 
Advertisement
Advertisement