ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజలందరూ పాటుపడాలని జిల్లా సంక్షేమ అధికారి ఈసంపెల్లి ప్రేమలత అన్నారు. మండల పరిధిలోని శివాపురం, షాపెల్లి గ్రామాలు బాల్య వివాహ రహిత గ్రామాలుగా ఎంపిక చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బాల్య వివాహాలపై సర్పంచ్ జబ్బ సరోజన, షాపెల్లి సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 18 ఏళ్లు అమ్మాయికి, 21 సంవత్సరాల నిండకుండా అబ్బాయికి వివాహం చేస్తే బాల్య వివాహం అంటారని తెలిపారు. ఇది చట్టరీత్యా నేరమన్నారు. రెండేళ్ల నుంచి బాల్య వివాహాలు నమోదు కానీ గ్రామాలను గుర్తించినట్లు తెలిపారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా 23 జీపీలను బాల్య వివాహ రహిత గ్రామ పంచాయతీలుగా ఎంపిక చేసి గ్రామ సభలను నిర్వహించినట్లు వెల్లడించారు. ఏటూరునాగారం మండలంలో శివాపురం, షాపెల్లి, కొండాయి లను బాల్య వివాహ రహిత గ్రామలుగా తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి హరికృష్ణ, ఉప సర్పంచ్‌లు నర్సింహరావు, సరిత, కార్యదర్శులు శ్రీనివాస్, రాజ్యలక్ష్మీ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌లు వసంత, రజిత, పుష్పవతి పాల్గొన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత


