శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

May 27 2026 6:14 AM | Updated on May 27 2026 6:14 AM

శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

గోవిందరావుపేట: బక్రీద్‌ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పస్రా సీఐ పత్తిపాక దయాకర్‌ అన్నారు. పస్రా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం పస్రా ఎస్సై తాజుద్దీన్‌ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా సీఐ దయాకర్‌ హాజరై మాట్లాడుతూ.. బక్రీద్‌ పండుగను కులమతాలకు అతీతంగా, పరస్పర గౌరవ భావాలతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీస్‌ శాఖకు సహకరించాలని కోరారు. సమావేశంలో నార్లాపూర్‌ ఎస్సై కమలాకర్‌, తాడ్వాయి ఎస్సై జగదీష్‌, ఎస్సైలు ఆంజనేయులు, ఎర్రయ్య, పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది, కాటాపూర్‌, గోవిందరావుపేట, బుస్సాపూర్‌, నార్లాపుర్‌, తాడ్వాయి ప్రాంతాల ముస్లిం మత పెద్దలు, బీజేపి, ఏబీవీపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

పస్రా సీఐ దయాకర్‌

Advertisement
 
Advertisement
Advertisement