మంగపేట: మండంలోని కమలాపురం రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 116లోని ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని పలు కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని రెవెన్యూ అధికారులు స్పందించి స్వాధీనం చేసుకోవాలని మన్య సీమపరిరక్షణ సమితి డోలుదెబ్బ మండల అధ్యక్షుడు తాటి నాగరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను మండల కమిటీ నాయకులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతమైన మండలంలో కొందరు భూబకాసురులు రాజకీయ అండదండలతో 1/70, ఎల్టీర్ చట్టాలను అతిక్రమించి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తు ప్లాట్లుగా సొమ్ము చేసుకుంటున్నారన్నారు. వెంటనే రెవెన్యూ అధికారులు 1/59, 1/70, ఎల్టీర్, పెసా వంటి ఏజెన్సీ చట్టాలను అమలుచేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ఆక తిరుమల్‌రావు, గొప్ప చంద్రకాంత్, పెద్దల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


