బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

May 27 2026 6:14 AM | Updated on May 27 2026 6:14 AM

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

ములుగు రూరల్‌: బాల్య వివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత అని బాలల పరిరక్షణ సమితి కోఆర్డినేటర్‌ నరేష్‌ అన్నారు. మంగళవారం మండంలోని బరిగలానిపల్లిలో బాల్య వివాహాం బతుకు ఆగం అనే వాల్‌ పోస్టర్‌ను జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆదేశాల మేరకు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బరిగలానిపల్లి, ఎల్లారెడ్డిపల్లి, బూర్గుపేట గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించామని అన్నారు. ఈ గ్రామాలు బాల్య వివాహరహిత గ్రామాలుగా గుర్తింపు పొందాయని అన్నారు. భవిష్యత్‌లో బాల్య వివాహాలు జరుకుండా చూడాలని అన్నారు. బాల్య వివాహల వల్ల కలిగే అనార్థాలను వివరించారు. బాల్య వివాహాలు జరిపినట్లుయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సిబ్బంది విక్రమ్‌, పంచాయితీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, అంగన్‌వాడీ టీచర్లు, సఖి లీగల్‌ కౌన్సిలర్‌ శిరిష, కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement