వెంకటాపురం(కె): గో టు విలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీస్ మండల అధ్యక్షుడు యాసం రమేష్ మాదిగ అన్నారు. మంగళవారం మండలంలోని మరికాల పంచాయితీ రామక్రిష్ణాపురంలో యువతతో మాట్లాడారు. మాదిగల పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మే 25 నుంచి జులై 25 వరకు కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ప్రతి మాదిగపల్లెలో ఎమ్మార్పీఎస్ జెండాలను ఎగర వేయాలని అన్నారు. మంద క్రిష్ణ మాదిగ మూడు దశాబ్ధాల పోరాట ఫలితంగా ఏబీసీడీ వర్గీకరణ సాధించామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మహేష్, మల్లికార్జున్, తిరుపతి, గౌతం, ఆనంద్, రవి తదితరులు పాల్గొన్నారు.


