సబ్సిడీపై జీలుగు విత్తనాలు | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీపై జీలుగు విత్తనాలు

May 27 2026 6:14 AM | Updated on May 27 2026 6:14 AM

సబ్సిడీపై జీలుగు విత్తనాలు నియామకం మజ్జిగ పంపిణీ ఇద్దరిపై కేసు నమోదు బెల్లి లలితకు నివాళి సన్మానం త్రుటిలో తప్పిన ప్రమాదం

ఏటూరునాగారం: మండలంలోని శివాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల రైతులకు నేటి(బుధవారం) నుంచి మండల కేంద్రంలోని ఆగ్రోస్‌ సెంటర్‌లో 50 శాతం సబ్సిడీ రాయితీపై జీలుగు విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఏఈఓ రవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఆధార్‌కార్డు జిరాక్స్‌, పట్టా పాస్‌ బుక్‌ జిరాక్స్‌లు తీసుకొని విత్తనాలను పొందాలన్నారు. 30కిలలోల బ్యాగ్‌కు రైతు రూ. 2452లు చెల్లించాలన్నారు.

ములుగు రూరల్‌: అఖిల భారత విశ్వకర్మ మహసభ మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలిగా జిల్లాకేంద్రానికి చెందిన గుంటోజు పావని–నిరంజన్‌ను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నౌండ్ల సంతోష్‌చారి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌చారి, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి పాటుపడతానని అన్నారు.

వెంకటాపురం(కె): బాటసారులదాహర్తి తీర్చేందుకు మండల కేంద్రంలోని సాయి పూజ సామగ్రి యజమాని మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు మంగళవారం వారాంతపు సంత కావడంతో పలు గ్రామాల నుంచి మండలకేంద్రాని వచ్చిన ప్రజలు వేసవి ఎండలకు ఇబ్బందులు పడుతుండడంతో దాహర్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేశారు.

రేగొండ: సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న ఫిర్యాదుదారు, అతడి మిత్రులపై వాట్సాప్‌ గ్రూపులో గుర్రాల సుమన్‌ రెడ్డి అనే వ్యక్తి అసత్య ప్రచారాన్ని పోస్ట్‌ చేశాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి విచారించగా కొలెపాక భిక్షపతి సూచన మేరకు వాట్సాప్‌ గ్రూపులో పోస్ట్‌ చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపాడు. సోషల్‌ మీడియాలో శాంతిభద్రతాలకు విఘాతం కలిగించే విధంగా పోస్ట్‌లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

దరఖాస్తు చేసుకోవాలి

కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్లు మంజూరు చేస్తున్న క్రమంలో మహదేవపూర్‌ మండలంలోని అర్హులైన దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు అందరూ దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్‌) మండల అధ్యక్షుడు వీరగంటి సమ్మయ్య సూచించారు. గత 13 సంవత్సరాల నుంచి పింఛన్‌ రాక వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు మనోవేదనకు గురయ్యారని, ప్రభుత్వం ఇటీవల నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోమని ప్రకటించడంతో వీరికి భరోసా, మనోధైర్యాన్ని కల్పించినట్లు అయిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

మల్హర్‌: మండలంలోని కొయ్యూరులో సోమవారం బెల్లి లలిత వర్ధంతిని ప్రజా సంఘాల జిల్లా చైర్మన్‌ పీక కిరణ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కిరణ్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాట మాటతో సబ్బండ వర్గాలను, కులాలను, చైతన్యం చేస్తూ తెలంగాణ పల్లెల్లో ఉద్యమ జ్వాలను రగిలించిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ దేవి భూమయ్య, సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనగామ జనార్ధన్‌. కుల ప్రజా సంఘాల జిల్లా కో కన్వీనర్‌ అయితే బాపు, మండల కో కన్వీనర్‌ గడ్డం లచ్చన్న, బోయిని రాజన్న, యాదండ్ల గట్టయ్య, వేల్పుల నారాయణ, యాట్ల శంకర్‌, సదానందం, తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి పట్ణణ కేంద్రంలోని ఆంజనేయ ఆలయ కమిటీ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికై న నాగపూరి సమ్మయ్యను మంగళవారం పట్టణ కేంద్రంలో ఐఎన్‌టీయూసీ బ్రాంచ్‌ ఉప అధ్యక్షులు బేతిల్లి మధుకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు శాలువతో సన్మానించారు. యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని సరస్వతీఘాటులో తెప్పోత్సవానికి విద్యుత్‌ వైరు సరిచేస్తుండగా అక్కడే పని చే స్తున్న బాపు అనే కూలీకి విద్యుత్‌షాక్‌ తగలడంతో మంగళవారం కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన మరో కూలీ కర్రతో కొట్ట డంతో ప్రమాదం తప్పింది. కొంత సేపు తరువాత బాపు స్పృహా నుంచి తేరుకున్నాడు. క్షేమంగా బయటపడడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement