సాగుకు రైతుల సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

సాగుకు రైతుల సన్నద్ధం

May 27 2026 6:14 AM | Updated on May 27 2026 6:14 AM

సాగుకు రైతుల సన్నద్ధం

నేల స్వభావం పెరుగుతుంది..

కన్నాయిగూడెం: మండలంలోని రైతులు వానకాలం పంట సాగు కోసం సన్నద్ధమవుతున్నారు. వర్షాకాలం జూన్‌ 15 తర్వాత ప్రారంభం కానుండడంతో ముందస్తుగా రైతులు పంట పొలాలను నేల స్వభావాన్ని బట్టి దుక్కులు చేస్తున్నారు. ముందస్తుగా పంట చేనులను వేసవి దుక్కులు చేస్తు పొలాలను చదును చేస్తున్నారు. వేసవి దుక్కుల వల్ల నేల స్వభావం పెరగడంతో పాటు నేలలో ఉన్న క్రిమీ కీటకాలు నసించడంతో కలుపు నివారణ కలుగుతుంది. భూమి లోపలి పొరలు చదును చేయబడి నీటిని పీల్చుకునే స్వాభావం పెరుగుతుందని వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలు చేస్తున్నారు. అధికారుల సూచనలతో రైతులు సాగుకు సిద్ధమై పనుల్లో బీజీగా మారారు. మండలంలోని రైతులు ఎక్కువ మొత్తం వర్షాదార పంటలపై మక్కువ చూపుతారు. అందులో ఎక్కువగా వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు సాగు చేయడానికి మక్కువ చూపుతారు.

పంటల అంచనా..

మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో సుమారుగా 10,500 ఎకరాల్లో పంటలను సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అందులో వరి 3,500, మొక్కజొన్న 500, మిర్చి 7,500 ఎకరాల్లో పంటలు అధికంగా సాగు చేసే సూచనలు ఉన్నట్లు వారు తెలుపుతున్నారు. అందుకు కావాల్సిన ఎరువులను సైతం సిద్ధం చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

వేసవి దుక్కులతో మేలు..

పొంట పొలాలను వేవి దుక్కులు దున్నడం వలన అధిక లాభాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా పంట పొలాలను ఎండ తీవ్రత ఉన్న సమయంలో దున్నడం వలన భూమిలో ఉన్న పంటలకు హాని కలిగించే పురుగుల, కీటకాలు నశిస్తాయి. దీంతో పాటు కలుపు మొక్కలు నివారించవచ్చు. కొంత భూమిని ప్లావ్‌ వేయడంతో భూమి తిరగబడుతుంది. అందులో కలుపు మొక్కల వేరువ్యవస్థపై సూర్య కిరణాలు పడి ఎండ తీవ్రతకు మాడి చనిపోతాయి. వీటితో పాటు భూమి పొరలు వదులగా మారి వర్షం పడ్డప్పుడు నీటిని పీల్చుకొని భూమి స్వభావం పూర్తిగా మారి అధిక పంటలు రావడానికి వీలుగా తయారవుతుంది. అందువలన రైతులు పంట చేపులను వేసవి దుక్కులు చేసుకోవా లని అధిక లాభాలు ఉన్నాయని తెలుపుతున్నారు.

రైతులు సాగు చేయబోయో పంటపొలలాలను అతిగా వేడి ఉన్న సమయంలో వేసవి దుక్కులు వేసుకోవాలని. దీంతో వలన నేల స్వభావం పెరుగుతుంది. నీటిని పీల్చుకోని పంటదిగుబడి రావడానికి ఉపయోగపడడంతో పాటు, భూమి లోపల ఉన్న క్రిమి కీటకాలు నసించి తెగుళ్లు రాకుండా కూడా ఎంతగానో ఉపయోగపడుతాయి.

– ముంజ మహేశ్‌, ఏఓ

దుక్కులు సిద్ధం చేస్తున్న అన్నదాతలు

Advertisement
 
Advertisement
Advertisement