వెంకటాపురం(కె): డిసిల్టింగ్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ నవనిర్మాణ సే రాష్ట్ర అధ్యక్షుడు కోర్స నర్సింహమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మండలకేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌జీటీ పర్యావరణ అనుమతులు లేవని దుమ్ముగూడెం సీతారామ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసిన బేకాతరు చేస్తున్నారని అన్నారు. నిలిచిపోయిన ప్రాజెక్టు ఎగువ భాగంలో డిసిల్టింగ్ అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ ఆందోళన కారుతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. తుడుందెబ్బ రాష్ట్ర మహిళా నాయకురాలు సుభద్ర, రాజేష్, మహేష్, నాగరాజు, పద్మ, చిలుకమ్మ పాల్గొన్నారు.


