సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ

May 27 2026 6:14 AM | Updated on May 27 2026 6:14 AM

సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ

ములుగు రూరల్‌: కాశిందేవిపేట పంచాయతీ పరిధి రామయ్యపల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సర్పంచ్‌ నిరోషాఅమర్‌సింగ్‌ భూమి పూజ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం నిర్మిస్తున్న మహిళా సంఘాల భవనానికి నిధులు మంజూరు కావడంతో నిర్మాణ పనులను ప్రారంభించారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ మర్రి రాజుయాదవ్‌, ఉప సర్పంచ్‌ ఎన్నిండ్ల సుదర్శన్‌, లియాకత్‌ అలి, రఘునందన్‌, నేపాల్‌రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ

కాశిందేవిపేట పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సర్పంచ్‌ నిరోషాఅమర్‌సింగ్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ చిన్నారులకు అందించే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement