అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం

May 26 2026 7:48 AM | Updated on May 26 2026 7:48 AM

ములుగు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా మండల పరిధిలోని దేవగిరిపట్నం అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ మేరకు సోమవారం జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత ఆధ్వర్యంలో సర్పంచ్‌ ఇస్లావత్‌ పూలమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రం భవన నిర్మాణానికి భూదాత సానికొమ్ము రోషిరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ శిరీష, సెక్టార్‌ సూపర్‌వైజర్లు అనంతలక్ష్మీ, రమాదేవి, కమరున్నీసాబేగం, సరస్వతి, జూనియర్‌ అసిస్టెంట్‌ సంపత్‌, వార్డు సభ్యుడు బాలాజీ, అంగన్‌వాడీ టీచర్లు విజయలక్ష్మీ, కవిత, రోజా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement