గిరిజన మ్యూజియం అద్భుతం | - | Sakshi
Sakshi News home page

గిరిజన మ్యూజియం అద్భుతం

May 26 2026 7:48 AM | Updated on May 26 2026 7:48 AM

పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో

భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం అద్భుతంగా ఉందని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో అన్నారు. భద్రాచలంలోని ట్రైబల్‌ మ్యూజియాన్ని ఆయన సోమవారం సందర్శించి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే వస్తువులు, వేట పరికరాలను పరిశీలించి మాట్లాడారు. మ్యూజియం ఆవరణలో గిరిజన తెగల సంస్కృతిని ప్రతిభింభించేలా ఏర్పాటు చేసిన పరికరాలు, నిర్మాణాలు బాగున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్‌రాజ్‌, ఉద్యోగులు ప్రభాకర్‌, వీరస్వామి, రాందాస్‌, పోశాలు పాల్గొన్నారు

భక్తులకు మజ్జిగ పంపిణీ

వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలో అంత్య పుష్కరాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రామప్పకు తరలివస్తున్న భక్తులకు సోమవారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఇమ్మడి భాస్కర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కాళేశ్వరంలో జరుగుతున్న అంత్య పుష్కరాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రామప్పను సందర్శించే భక్తులకు విజయవాడ పట్టణానికి చెందిన కోనేటి ఏడుకొండలు – దుర్గశ్రీలక్ష్మి దంపతులు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వేసవిలో భక్తులు వడదెబ్బకు గురికాకుండా మజ్జిగ కొంతమేర ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు హరీశ్‌ శర్మ, ఉమాశంకర్‌, ఆలయ సిబ్బంది సంతోష్‌, దామోదర్‌, రత్న కుమారి, టూరిస్ట్‌ గైడ్‌ విజయ్‌ కుమార్‌, టూరిస్ట్‌ పోలీసులు శ్రీనివాస్‌, అరుణ్‌, పురావస్తు శాఖ, గార్డెన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

వాడబలిజలను

ప్రభుత్వం గుర్తించాలి

ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం వాడబలిజలను ఆర్థికంగా, సామాజికంగా గుర్తించాలని రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్‌, సలహాదారుడు తోట మల్లికార్జున్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గార ఆనంద్‌ అధ్యక్షతన సోమవారం సభను ఓడవాడ నుంచి వై జంక్షన్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరించారు. అనంతరం సభకు చేరుకొని ఆయన మాట్లాడారు. గోదావరి ప్రాంతాల్లో ఉన్న వాడబలిజలకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చేపల వేటకు సరైన గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజి కల్పించి చేపల వేటకు కావాల్సిన పరికరాలు, సామగ్రిని అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణయ్య, భాస్కర్‌, ఆదినారాయణ, మహేశ్‌, తోటి ప్రశాంత్‌, వీరన్న, సునీల్‌, రాంప్రసాద్‌, ఖాదర్‌బాబు, కర్ల అరుణ, కమల, సూర్యం పాల్గొన్నారు.

నాలుగు దుకాణాల్లో

చోరీ

ములుగు రూరల్‌: జిల్లాకేంద్రంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. జాతీయ రహదారిపై ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి వైన్స్‌, రెడ్డి వైన్స్‌, మహదేవ్‌ ఐరన్‌ హర్డ్‌వేర్‌, జీ ఫ్యామిలి మార్ట్‌ల్లో చోరీలకు పాల్పడినట్లు ఎస్సై ఉపేందర్‌రావు వెల్లడించారు. రాత్రి షాపులు బంద్‌ చేసి వెళ్లిన యజమానులు ఉదయం వచ్చి చూడగా తలుపులు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మహదేవ్‌ ఐరన్‌ హర్డ్‌ వేర్‌లో రూ. 1.50 లక్షలు, రెడ్డి వైన్స్‌లో రూ. 40 వేలు, జీ ఫ్యామిలి మార్ట్‌లో రూ. 25 వేలు, శ్రీ పెద్దమ్మతల్లి వైన్స్‌లో రూ. 50 వేల నగదు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని ఎస్సై వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement