ఏటూరునాగారం: బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మినర్సింహరావు తాడ్వాయి మండల పరిధిలోని మేడారం వనదేవతలను సోమవారం దర్శించుకున్నారు. ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు లక్ష్మినర్సింహరావు వెల్లడించారు. అమ్మవారికి బంగారాన్ని సమర్పించి కొబ్బరి కొట్టారు. ఆలయ పూజారులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఎండోమెంట్, పూజారులు నాయకులకు కండువాలను కప్పి సత్కరించారు. అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కునూరు అశోక్, తాటి కృష్ణ, దిడ్డి మోహన్‌రావు, తాడూరి రఘు, చిట్టిమల్ల సమ్మయ్య, మైపాల్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, యలవర్తి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


