ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం బందాల గ్రామంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూముల్లో బోరు బావులు, విద్యుత్ సరఫరాకు అనుమతి ఇవ్వాలని బందాల సర్పంచ్ మంకిడి శ్రీలత ఏపీఓకు విన్నవించారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులకు పట్టాదారు పుస్తకాలు లేని రైతులను గుర్తించి ఇవ్వాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి ఏపీఓను కోరారు. మండలంలోని షాపెల్లిలో చెరువుల్లోని చేపలు గిరిజనేతరులు పట్టుకుంటున్నారని ఆరోపిస్తూ ఏపీఓకు కోరగంట్ల లక్ష్మణ్‌రావు వినతి పత్రాలను అందజేశారు. మంగపేట మండలం చుంచుపల్లికి చెందిన కొమురం రామకృష్ణ ఇందిరమ్మ ఇల్లు కావాలని విన్నవించారు. కాంట్రాక్టు అటెండర్ జాబ్ ఇప్పించాలని బానోత్ రాములు కోరారు. మంగపేట పీహెచ్‌సీలో స్టాఫ్ నర్సు ఉద్యోగం ఇప్పించాలని శనిగకుంటకు చెందిన బొడ్డు రాజమణి విన్నవించారు. తాడ్వాయికి చెందిన గౌరబోయిన పరమయ్య ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా పాస్‌బుక్ ఇప్పించాలని కోరారు. మేడారం ఆదివాసీ మ్యూజియంలో పనిచేస్తున్న కాల్వపెల్లికి చెందిన సిద్ధబోయిన నాగరాణి వేతనం ఇప్పించాలని ఏపీఓను కోరారు. గిరివికాసం పథకం కింద బోరు మంజూరు చేయాలని తాడ్వాయి మండలం గంగారానికి చెందిన మల్కం దేవయ్య కోరారు. ఇలా పలువురు బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీఓకు వినతి పత్రాలు అందజేశారు.


