ములుగు రూరల్: అల్పాహార పాత బిల్లులను తక్షణమే చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. సోమవారం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. గ్రీవెన్స్‌లో అదనపు కలెక్టర్ సంపత్‌రావుకు వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 అక్టోబర్ నుంచి నేటి వరకు వంట కార్మికులకు అల్పాహారం బిల్లులు ప్రభుత్వం విడుదల చేయలేదని అన్నారు. బిల్లులు మంజూరు చేస్తేనే జూన్‌లో ప్రారంభించే అల్పాహారం సజావుగా సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బండి కొమరయ్య, నాయకులు గడ్డం భారతి, రమీల, రాజకుమారి, పద్మ, భవాని, భాగ్య, పోషమ్మ, సరిత తదితరులు ఉన్నారు.


