పంచాయతీల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును అధికారులు వినియోగంలోకి తీసుకురావాలి. రోడ్డు పక్కన చెత్తా చెదారం వేయకుండా చర్యలు చేపట్టాలి. డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన వర్మి కంపోస్టు షెడ్లను వినియోగంలోకి తీసుకువచ్చి కంపోస్టు ఎరువు తయారు చేసేలా అధికారులు చూడాలి.
– తంగెల్లపల్లి ప్రసాద్, వెంకటాపురం(కె)
చెత్తా చెదారం రోడ్డు పక్కన వేసి చెత్తకు నిప్పు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలి. రోడ్డు పక్కన, చెరువులో చెత్త, వ్యర్థాను వేయటం వల్ల దుర్వాసన వస్తోంది. రోడ్డుపై ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
– కట్ల నర్సింహాచారి, వెంకటాపురం(కె)


