వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు నుంచి ధర్మవరం గ్రామం వరకు నిలిచిపోయిన రహదారిని నిర్మించాలని కోరుతూ ప్లకార్డులతో సీపీఎం నాయకులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల పరిధిలోని చెరుకూరు నుంచి ధర్మవరం గ్రామం వరకు అటవీ అనుమతులు లేవని రహదారి పనులు నిలిపివేశారని అన్నారు. ఈ రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని లేని పక్షంలో నాలుగు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో రహదారి దిగ్భంధనం చేస్తామని తెలిపారు. నిరసన తెలిపిన వారిలో సదాక్రేన్, నరేష్, మహేందర్, రమేష్ తదితరులు ఉన్నారు.


