కన్నాయిగూడెం: మండల పరిధిలోని ఏటూరు నుంచి కంతనపల్లి వరకు ఉన్న దట్టమైన అడవిలో మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఎండిన ఆకులు ఉండడంతో నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. మంటల్లో చెట్లు, జీవరాశులు ఆహుతి అవుతున్నాయి. అడవిని రక్షించాల్సిన అటవీ శాఖ అధికారులు అటుదిక్కు కన్నెతి కూడా చూడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి మంటలను ఆర్పాలని కోరుతున్నారు.
కన్నాయిగూడెం: మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీలో పని చేయని చేతి పంపులను సర్పంచ్ జాడి రాంబాబు మరమ్మతు చేయించారు. తాగు నీటికి ఇబ్బంది కాకుండా ఉండేదుకు మరమ్మతు చేయించినట్లు సర్పంచ్ తెలిపారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వాజేడు: మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో సోమవారం ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారి నవీన్ అధ్వర్యంలో ఉచిత మొబైల్ ఏఐ చెస్ట్ ఎక్స్‌రే స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించారు. ఈ స్క్రీనింగ్‌లో 117 మంది రోగులకు ఎక్స్‌రే తియ్యగా అందులో 32 మంది టీబీ అనుమానితులను గుర్తించినట్లు వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ వేణుగోపాల కృష్ణ, వెంకటేశ్వర్లు, సుమలత, తిరుపతి, తదితరులు ఉన్నారు.
ములుగు రూరల్: విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యా పరిరక్షణ రాష్ట్ర కమిటీ ఆధ్వదర్యంలో జూన్ 5 వ తేదీన చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లె నాగరాజు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో జూన్ 5న చెపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోతూరు పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకులు రేగ నరేందర్, గన్ రెడ్డిఆదిరెడ్డి, పాల ఉప్పల స్వామి, దిలీప్, బానోత్ సూర్య, వైనా స్వామి, సతీష్ ఉన్నారు.
ములుగు రూరల్: విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందిన సంఘటన ములుగు మున్సిపాల్టి పరిధి బండారుపల్లి శివారులో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రేమ్‌నగర్ గ్రామానికి చెందిన జంగిలి రవితేజకు సంబంధించిన పాడి గేదెలను రోజు వారిలా మేతకు వదిలాడు. బండారుపల్లి శివారులో అక్రమంగా విద్యుత్ వైర్లు వేసి పంటకు నీరు పెడుతున్నారు. ఈ క్రమంలో అటుగా మేతకు వెళ్లి పాడిగెదే విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందింది. పాడిగేదె విలువ సుమారు రూ. 80 వేల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు పరిహారం అందించాలని కోరారు.
వాహనం ఢీకొని..
వెంకటాపురం(కె): మండల కేంవద్రంలోని శివాలయం సమీపంలో సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని పాడిగేదె మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శివాలయం సమీపం నుంచి గేదెలు మేతకు సమీప పొలాల్లోకి వెళ్తున్నాయి. ఉదయం గుర్తు తెలియని వాహనం గేదెను ఢీకొట్టడంతో గేదె అక్కడి అక్కడే మృతి చెందింది. గేదె ఎవరిది అనే విషయం ఇంత వరకు తెలియలేదు. కాగా, మృతి చెందిన గేదె విలువ సుమారు నలబై వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.


