వెంకటాపురం(ఎం): మండలంలో 32 గ్రామైక్య సంఘాలు ఉండగా 21 సంఘాల భవన నిర్మాణాలకు సోమవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్లు ఏపీఎం ధర్మేందర్ తెలిపారు. ఈజీఎస్ పథకంలో భాగంగా ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఐకేపీ సీసీలు, వీఓ సంఘం అధ్యక్షుడు, మహిళలు పాల్గొన్నారు.
వాజేడు: వాజేడు మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి, నాగారం, మొదలైన గ్రామ పంచాయతీల్లో మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపనలు చేశారు. ఆయా పంచాయతీల సర్పంచ్‌లు బోదెబోయిన భరత్ కుమార్, బోదెబోయిన స్వరూపలు కొబ్బరి కాయలను కొట్టి భవనాల నిర్మాణాలను ప్రారంభించారు.
మహిళ సంఘాల భవనాలకు భూమిపూజ
కన్నాయిగూడెం: మండలంలోని తుపాకులగూడెం, బుట్టాయిగూడెం, కన్నాయిగూడెం గ్రామాకుల ప్రభుత్వం మహిళా సంఘాల భవనాలను మంజూరు చేసింది. వాటిని సర్పంచ్‌లు భూమి పూజ చేసి ప్రారంభించారు. బుట్టాయిగూడెంలో సర్పంచ్ జాడి రాంబాబు అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేకాధికారి, ఏపీడీ వెంకటనారాయణ, మహిళ సమాఖ్య ఏపీఎం రాంబాబు, ఈజీఎస్ ఏపీఓ సురేష్, మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, తుపాకులగూడెం సర్పంచ్ పీరీల స్వప్న, రాజన్నపేట సర్పంచ్ పొడెం నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
మంగపేట: మండలంలోని రాజుపేట, రమణక్కపేట గ్రామాల్లో మహిళా పొదుపు సంఘాల గ్రామాఖ్య సంఘాలకు ప్రభుత్వం మంజూరీ చేసిన భవనాల నిర్మాణం పనులకు టీఎస్‌ఈజీసీ సభ్యుడు గుమ్మడి సోమయ్య భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వల్లెపల్లి శివప్రసాద్, రామిరెడ్డి, ముఖర్జీ, నర్సింహారావు, ఐకేపీ ఏపీఎం సత్యనారాయణరెడ్డి, సీసీ, వీవోఏలు, మహిళా పొదుపు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం: మండలంలోని కోయగూడ ఎల్లాపురం(రాంనగర్) గ్రామంలో మహిళ సంఘా భవనానికి సర్పంచ్ పోరిక సరిత భూమి పూజ చేశారు. రాంనగర్ గ్రామంలో మహిళ సంఘాల సమావేశం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన భవనాన్ని పూర్తి చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గార గాంధీ, వార్డు సభ్యులు గద్దె జయకృష్ణ, వంకాయల లత, ఓజ్జల స్వప్న, సౌందర్య, రమేష్, ఐకేపీ సీసీ సరోజన, వీఓ అధ్యక్షులు గొర్లపల్లి సత్యవతి, అనిల్ పాల్గొన్నారు.
వెంకటాపురం(ఎం): నల్లగుంటలో..
వాజేడు: గుమ్మడిదొడ్డిలో..


