శివాలయం వద్ద రోడ్డు పక్కన పడేసిన చెత్త
మార్కెట్ యార్డు సమీపంలో చెరువులో వేసిన చెత్త
వెంకటాపురం(కె): ఇంటింటికీ చెత్త సేకరించి వందశాతం పారిశుద్ధ్యం సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామాల్లో సేకరించిన చెత్తను ఆ రు బయట రోడ్డు పక్కన, చెరువులో వేయడం వల్ల డంపింగ్ యార్డులు నిరుపయోగంగా మారాయి. రోడ్డు పక్కన, చెరువుల్లో పడేసిన చెత్తకు నిప్పు పెడుతుండడంతో దుర్వాసన రావడంతో పాటు పొగకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కన చెత్త వేసి నిప్పు పెట్టి ప్రజల ఆరోగ్యానికి హా ని కలుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవ డం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు పడతున్న ప్రజలు..
వర్మికంపోస్టు షెడ్లలో చెత్తను వేరు చేయడం, ఎరువులు తయారు చేయడం వంటి పనులు చేపట్టక పోతుండటంతో పాటు పంచాయతీలో సేకరించిన చెత్తతో పాటు ప్లాస్టిక్ కవర్లు తదితర వస్తువులు, వ్యర్ధాలను డంపింగ్ యార్డులో వేయడం లేదు. రోడ్డు పక్కన, బోడ చెరువులో పడేసి తగల బెట్టడం వలన వచ్చే పొగతో ప్రజలు, రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి డంపింగ్ యార్డులోనే చెత్త వేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్ల పక్కనే చెత్తాచెదారం
పట్టించుకోని అధికారులు


