ముగిసిన సమ్మర్‌ క్యాంపు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన సమ్మర్‌ క్యాంపు

May 26 2026 7:48 AM | Updated on May 26 2026 7:48 AM

ముగిసిన సమ్మర్‌ క్యాంపు

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని పీఎ శ్రీ పాఠశాలలో ప్రారంభమైన సమ్మర్‌ క్యాంపు సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కొయ్యడ మల్లయ్య, హెచ్‌ఎం వాసం సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రత్యేక కళలు, రుగ్మతులు, వివిధ రకాల ప్రోగ్రాంలతో నిర్వహించిన సమ్మర్‌ క్యాంపునేటితో ముగిసిందని అన్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు చిన్నారులకు క్యారమ్స్‌, చెస్‌, రంగులు, డ్యాన్స్‌ రకరకాల విన్యాసాలతో వారికి శిక్షణ ఇచ్చామన్నారు. క్రీడలు ఆడడం వల్ల జరిగే లాభాలను వివరించామన్నారు. చిన్నారులు ఇంటిలో సెల్‌, టీవీలకు పరిమితం కాకుండా ఈ క్యాంప్‌ వల్ల అనేక విషయాలను నేర్పించామన్నారు. ఇదేకాకుండా భవిష్యత్‌లో ఎలాంటి శిక్షణ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని, క్రమ శిక్షణ, గురువులపై గౌరవం, తల్లిదండ్రులపై ప్రేమ అనురాగం చూపేవిధంగా వారికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.

విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి

మండలంలో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన 2025–26 విద్యా సంవత్సరంలోని విద్యార్థులకు గంగిశెట్టి మధురిమ ట్రస్ట్‌ ఆద్వర్యంలో సోమవారం మండల కేంద్రలోని జెడ్పీహెచ్‌ఎస్‌ లో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మల్లయ్య మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో మండల కేంద్రానికి చెందిన కృష్ణ రాష్ట్రంలో మూడో ర్యాంకు సాధించగా విద్యార్థితో పాటు మరో ఆరుగురికి పోత్సహక బహుమతులను గంగిశెట్టి మధురిమ ట్రస్ట్‌ చైర్మన్‌ గంగిశెట్టి జగదీశ్‌ అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement