వెంకటాపురం(కె): డిసిల్టేషన్‌ను రద్దు చేసి పాత పద్ధతిలోనే సొసైటీల ద్వారా ఇసుక ర్యాంపులను నిర్వహించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు దామోదర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని లుబాక గ్రామంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల మహాసభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏజెన్సీలోని ఆదివాసీ చట్టాలను నిర్వర్యం చేస్తుందన్నారు. ఆదివాసీ గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వారికి సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని తెలిపారు. సీతమ్మ ధార ప్రాజెక్టు పేరుతో వెంకటాపురం మండలంలో లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడికి గురవుతుందని అన్నారు. డిసిల్టెషన్ పేరుతో గోదావరి నదిలో 15 కిలో మీటర మేర ఇసుకను కొల్లగొట్టెందుకు చూస్తున్నాని అన్నారు. అనంతరం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పూనెం చందు, కార్యదర్శిగా వెంకటేశ్వర్లను ఎన్నుకున్నారు. నాయకులు ఇర్ప శ్రీను, నాగేష్, చందర్రావ్, వెంకటనారాయణ తదితరులు ఉన్నారు.
ఆదివాసీ గిరిజన సంఘం
రాష్ట్ర కమిటీ సభ్యుడు దామోదర్


