గోవిందరావుపేట: గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టాలని ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ సీడీపీఓ విజయ అన్నారు. మండలంలోని కోటగడ్డ, గాంధీనగర్ గ్రామ పంచాయతీల్లో చైల్డ్ మ్యారేజీ ఫ్రీ విలేజ్ కార్యక్రమాలను సోమవారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారు సర్పంచ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ విజయ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో ప్రజలందరూ కలిసి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ జ్యోతి మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో నిరంతర సర్యవేక్షణ కొనసాగిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం బాల్య వివాహాలు జరగనివ్వమని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎం సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ సీడీపీఓ విజయ


