స్థానికులనే నియమించాలి | - | Sakshi
Sakshi News home page

స్థానికులనే నియమించాలి

May 26 2026 7:48 AM | Updated on May 26 2026 7:48 AM

స్థానికులనే నియమించాలి క్షుద్రపూజల కలకలం

వాజేడు: మండల పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో కాళీగా ఉన్న పోస్టుల్లో స్థానికులనే నియమించాలని సర్పంచ్‌ బోదెబోయిన స్వరూప ఆధ్వర్యంలో జంగాలపల్లి గ్రామస్తులు సోమవారం తీర్మానం చేశారు. జంగాలపల్లి గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌ పోస్టు కాళీగా ఉంది. ఈ పోస్టులో నియమ నిబంధనల ప్రకారం స్థానికులను నియమించాలని వారు డిమాండ్‌ చేశారు. వేరే అంగన్‌ వాడీ కేంద్రాల నుంచి ఇక్కడికి ఎవరిని బదిలీ చెయ్యొవద్దన్నారు. అందుకు సంబంధించిన వినతి పత్రాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్‌ బోదెబోయిన స్వరూప, ఉపసర్పంచ్‌ మందపాటి సుబ్బరాజుతో కలిసి గ్రామస్తులు అందజేశారు.

కన్నాయిగూడెం: మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరు ప్రధాన రహదారి వద్ద క్షుద్ర పూజల కలకలం రేపాయి. ఆదివారం రాత్రి గ్రామంలోకి వెళ్లే ప్రధాన కూడలి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పచ్చగుడ్డలో కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, నిమ్మకాయ, పసుపుతో అన్నం ముద్ద, కుంకుమతో మరో అన్నముద్దను పెట్టి వెళ్లారు. సోమవారం ఉదయం వెళ్లిన ప్రజలు వాటిని చూసి భయందోలనకు గురయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement