గోవిందరావుపేట: ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని సర్పంచ్ మేకలరాధ సుదర్శన్ అన్నారు. మండలంలోని చల్వాయిలో సోమవారం సీసీ రోడ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో రోడ్ల నిర్మాణంతో ప్రజలకు రాకపోకలు సౌకర్యవంతంగా మారనున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పైడాకుల కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రకాశ్, సారయ్య, వెంకటేష్, సుదాకర్, అశోక్ ఏఈ సూపర్‌వైజర్ విక్కీ తదితరులు పాల్గొన్నారు.


