మామయ్యా.. నీ ఆశయం నెరవేరలేదు
‘మామయ్యా.. నీ ఆశయం నెరవేరలేదు. నాకు ఆన్యాయం జరిగింది మామయ్య..’ అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ నల్లెల్ల స్వాతి రోదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక అనంతరం ఇంటికి వెళ్లిన స్వాతి తన మామయ్య జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దివంగత నల్లెల్ల కుమారస్వామి చిత్రపటం ఎదుట తీవ్రంగా రోదించారు. ములుగు మున్సిపాలిటీ తొలి చైర్ పర్సన్‌గా నల్లెల్ల కుటుంబానికి చెందిన స్వాతికి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావించారు. అనుహ్యంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి సతీమణి చంద్రకళకు అవకాశం దక్కడంతో ములుగులో చర్చనీయాంశంగా మారింది.


