తొలి చైర్‌పర్సన్ చంద్రకళ
కొలువుదీరిన ములుగు మున్సిపల్ కార్యవర్గం
ములుగు: నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ తొలి పాలకవర్గం కొలువుదీరింది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ ఎన్నికలో తొలి చైర్‌పర్సన్‌గా చింతనిప్పుల చంద్రకళభిక్షపతిని కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపిక చివరవరకు ఉత్కంఠగా కొనసాగింది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి సీతక్క చైర్ పర్సన్‌గా చంద్రకళ, వైస్ చైర్‌పర్సన్‌గా ఆసియా షాహిన్‌ను ఎంపిక చేశారు. చైర్‌పర్సన్ పదవి కోసం నల్లెల్ల స్వాతి, చింతనిప్పుల చంద్రకళ మధ్య తీవ్రంగా పోటీ నెలకొనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకు చంద్రకళను ఎంపిక చేసినట్లు సీతక్క వెల్లడించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు మంత్రి సీతక్క సూచించిన అభ్యర్థులనే చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం
ములుగు మున్సిపాలిటీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 11 గంటలకు తొలుత ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఇద్దరు, తర్వాత బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఐదుగురు, బీజేపీ కౌన్సిలర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌కు చేరుకున్నారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు 11:55 గంటలకు కలెక్టరేట్‌కు వచ్చారు. 20 మంది కౌన్సిలర్లను తెలుగు అక్షరమాల ప్రకారం అభ్యర్థులను పిలిపిస్తూ కౌన్సిలర్లుగా ములుగు ఆర్డీఓ వెంకటేష్ ప్రమాణ స్వీకారం చేయించారు.
స్వతంత్రుల మౌనం..
చైర్‌పర్సన్ ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ చింతనిప్పుల చంద్రకళను కౌన్సిలర్లు సిలువేరు సాంబయ్య, ఓం ప్రకాశ్, కుతుబుద్దీన్ ప్రతిపాదించగా మిగిలిన 9మంది బలపరచడంతో చైర్ పర్సన్‌గా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి వెంకటేష్ ప్రకటించారు. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆసియా షాహీన్‌ను గుంటో జు పావని, ఓంప్రకాశ్ ప్రతిపాదించగా 10 మంది బలపరచడంతో ఆసియా షాహిన్ ఎన్నికై నట్లు ప్రకటించారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించకుండా, ఓటింగ్‌లో పాల్గొనకుండా మౌనంగా ఉన్నారు. నూతన చైర్‌పర్సన్ చంద్రకళ, వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహీన్, కౌన్సిలర్లు కాన్ఫరెన్స్ హాల్‌లో మంత్రి సీతక్కను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎంపిక కోసం నామినేషన్లు(దరఖాస్తు) వేయాలని అధికారులు ప్రకటించారు. ఇందు కోసం బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్ తాము దరఖాస్తు చేసుకునేందుకు ఫాంలు ఇవ్వాలని కోరారు. కానీ రెండు రోజుల క్రితమే ఫాంలు పంపిణీ చేశామని ఇప్పుడు ఫాంలు ఇవ్వలేమని అధికారులు చెప్పడంతో బీఆర్‌ఎస్‌కు చెందిన రేసోజు పద్మ, బైకాని సునిత, బైకాని అనూష, గోనెల భరత్‌కుమార్, కొగిల లక్ష్మి, బీజేపీకి చెందిన కొత్త సురేందర్ సమావేశాన్ని బహిష్కరించి ఓటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకుడు గంగాధర్, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ పాల్గొన్నారు.
వైస్ చైర్‌పర్సన్‌గా ఆసియా షాహీన్
ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు
తొలి చైర్‌పర్సన్ చంద్రకళ
తొలి చైర్‌పర్సన్ చంద్రకళ
తొలి చైర్‌పర్సన్ చంద్రకళ


