ములుగు జిల్లాకు ఏడేళ్లు
మున్సిపాలిటీగా మార్పు..
ములుగు జిల్లా కేంద్రం వ్యూ
ములుగు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2016లో నాటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ల పునర్విభజన చేపట్టింది. ఆ సమయంలో ము లుగు, భూపాలపల్లిని ఒకే జిల్లాగా ఏర్పాటు చేశా రు. దీంతో ములుగు ప్రజలు ములుగు జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమించడంతో 2019 ఫిబ్రవరి 16న జిల్లా ఏర్పాటు చేస్తూ నాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. 17వ తేదీ నుంచి కొత్తగా ములుగు జిల్లా పాలన అమలులోకి వచ్చింది. 1956లో తాలుకాగా 1985లో గ్రామ పంచాయతీగా ఏర్పడిన ములుగు 2011లో మేజర్ పంచాయతీగా అభివృద్ధి చెందింది.
33వ జిల్లాగా ఏర్పాటు
2016లోనే ములుగు జిల్లా ఏర్పడుతుందని ఆశించిన ఇక్కడి ప్రజలకు నిరాశ ఎదురుకావడంతో ఉద్యమబాట పట్టారు. ప్రజల ఆకాంక్షను గుర్తించిన అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ములుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఏడు, భద్రాద్రి కొత్తగూడెం సెగ్మెంట్ పరిధిలోని రెండు మండలాలు కలిపి జిల్లాగా ప్రకటించింది. 9 మండలా లు 174 గ్రామపంచాయతీలతో ఏర్పడిన ములు గు జిల్లా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ములుగు పరిధిలోని మల్లంపల్లి గ్రామపంచాయతీని జేడీ మల్లంపల్లి మండలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో జిల్లాలో మండలాల సంఖ్య 10కి చేరింది. ములుగు జిల్లా 3,881 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో రాష్ట్రంలోనే 11వ అతిపెద్ద జిల్లాగా (వైశాల్యంలో) గుర్తింపు పొందింది. ఇందులో 2,945.45 చదరపు కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉండడం, 90 కిలోమీటర్ల విశాలమైన, సుందరమైన గోదావరి తీరం కలిగి ఉండటం విశేషం.
రామప్పకు యునెస్కో గుర్తింపు..
జిల్లాలో రామప్ప, లక్నవరం, మేడారం సమ్మ క్క– సారలమ్మ, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి , బొగత, ముత్యంధార జలపాతం, బ్లాక్‌బెర్రీ తదితర పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే యునెస్కో గుర్తింపు పొందిన ఏకై క ఆలయం రామప్ప ఈ జిల్లాలో ఉంది. రామప్ప ఆలయానికి 2021 జూలై 25న ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. గత నెలలో జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రూ.101 కోట్లతో తల్లుల గద్దెలను ప్రభుత్వం విస్తరించింది. అంతేకాకుండా రాష్ట్ర కెబినేట్ సమావేశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మేడారంలో ఏర్పాటు చేశారు. మేడారం జాతరకు రూ.150 కోట్ల నిధులు కేటాయించారు.
విద్యారంగంలో ముందడుగు
డిగ్రీ కళాశాల కోసం ఒకప్పుడు ప్రజా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నుంచి దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల ఏర్పాటు జిల్లాకు శుభపరిణామంగా భావించవచ్చు. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు కేటాయించి న సమ్మక్క, సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ములుగు జిల్లాలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించగా కేంద్రం రూ.830 కోట్లను కేటాయించింది. 287 ఎకరాలను అప్పగించగా పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రేమనగర్ వద్ద జిల్లా ఆస్పత్రి కోసం నిర్మించిన భవనంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. 50 మెడికల్ సీట్లు కేటాయించగా తరగతులు కొనసాగుతోన్నాయి. ఇక్కడే నర్సింగ్ కళాశాల కూడా కొనసాగుతోంది.
మేజర్ గ్రామపంచాయతీ హోదాతోనే జిల్లా కేంద్రంగా ఏర్పాటైన ములుగును మున్సిపాలిటీగా మార్చేందుకు 2022 సెప్టెంబర్ 12న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంత్రి ధనసరి సీతక్క ప్రత్యేక చొరవతో బండారుపల్లి, జీవింతరావుపల్లి జీపీలను కలుపుకొని 2024 లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో పాటు ప్రభుత్వం, గవర్నర్ ఆమోదించారు. దీంతో 2025 ఏప్రిల్ 5న ములుగు మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. నూతనంగా ఏర్పాటైన ములుగు మున్సిపాలిటీకి ఈనెల 11 ఎన్నికలు జరగగా 20 వార్డుల్లో 12 కాంగ్రెస్, 5 బీఆర్‌ఎస్, రెండు ఇండిపెండెంట్లు, ఒకటి బీజేపీ గెలుచుకున్నాయి. ములుగు మున్సిప ల్ తొలి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌కు చెందిన చింతనిప్పుల చంద్రకళ ఎన్నికయ్యారు.
నేడు 8వ వసంతంలోకి అడుగు
జీపీ నుంచి మున్సిపాలిటీగా..


