కాంగ్రెస్‌లో చేరిన ముప్పనపల్లి సర్పంచ్
కన్నాయిగూడెం: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండీ అప్సర్ పాషా, బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు. ముప్పనపల్లి సర్పంచ్(బీఆర్‌ఎస్) తిప్పనపల్లి లక్ష్మయ్య, లక్ష్మీపురం మాజీ సర్పంచ్ కొట్టె ఉమామహేశ్వరి తదితరులు కార్యకర్తలతో కలిసి సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. ములుగులోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో సీతక్క వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వీరితోపాటు తిప్పనపల్లి ఎర్ర సమ్మయ్య, మహేందర్, మహేష్, వెంకటేష్, లక్ష్మయ్య, సంతోష్, ప్రవీణ్, సోదండి రాజు, జిలకర మహంకాళి, తదితరులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు.
సేవాలాల్ సేవలు
మరువలేనివి
ఏటూరునాగారం: సేవాలాల్ సేవలు మరువలేనివని మహబూబాబాద్, ములుగు జిల్లాల గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గురుకులం పాఠశాలలో సేవాలాల్ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి హరి సింగ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం వారం రోజులపాటు సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ప్రిన్సి పాల్ శ్రీరాములు, అధ్యాపకులు వీరన్న, జైపా ల్, కుమారస్వామి, పృథ్వీరాజ్, గోపాల్‌రావు, నర్సయ్య, కృష్ణయ్య, శంకర్ పాల్గొన్నారు.
మంత్రి సీతక్కను
సత్కరించిన నాయకులు
గోవిందరావుపేట: ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం నూతన చైర్మన్, వైస్ చైర్మ న్ ఎన్నిక అనంతరం చల్వాయి గ్రామానికి చెందిన పార్టీ నాయకులు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ విజయంలో కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో చల్వాయి సర్పంచ్ మేకల రాధసుదర్శన్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నాగలక్ష్మి, అనిల్ యాదవ్, సుధాకర్, శ్రీను పాల్గొన్నారు.
గోవిందరావుపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన భూమాత నిరుపయోగంగా మారిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు తుమ్మల వెంకట్ రెడ్డి అన్నారు. మండలంలోని పస్రా పార్టీ కార్యాలయంలో గుండు రామస్వామి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల మంది పట్టా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ధరణి వల్ల ఏ ఒక్క రైతుకు న్యా యం జరగలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత తీసుకొచ్చి రైతులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించి రెండు సంవత్సరాలైనా న్యాయం చేయలేదన్నారు. పహాణిలో పట్టాదారు కాలంలో యజమాని ఒప్పుకుంటే ఇస్తామనడం రైతులను మోసం చేయడమేనని అన్నారు. ఈ నిబంధనల వల్ల ఏ రైతుకి పాసుబుక్ రాలేదని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెబుతూ రైతులకు తీరని నష్టం చేసిందని, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వం రైతాంగాన్ని దగా చేస్తుందని అన్నారు. ఇప్పటికై నా మంత్రి సీతక్క జోక్యం చేసుకోని ఏజేన్సీలోని రైతులకు న్యాయం చే యాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, తీగల ఆగిరెడ్డి, కోటేశ్వరరావు, సదానందం, సాంబయ్య, సూర్యనారాయణ, ధర్మారెడ్డి, ఆది రెడ్డి, నాగరాజు, లెనిన్, నగేష్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన ముప్పనపల్లి సర్పంచ్
కాంగ్రెస్‌లో చేరిన ముప్పనపల్లి సర్పంచ్
కాంగ్రెస్‌లో చేరిన ముప్పనపల్లి సర్పంచ్


