పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం
ములుగు: కుటుంబ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగులోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం జరి గిన మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమానికి ఆమె అతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రతీ కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింతనిప్పుల చంద్రకళను ఎన్నుకున్నామని చెప్పారు. ప్రతీ ఒక్కరికి చైర్‌పర్సన్ కావాలనే ఆశ ఉంటుంది. కానీ అవకాశం ఒక్కరికి మాత్రమే దక్కుతుందని అన్నారు. అనుభవం కలిగిన నాయకుడిగా, ములుగు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్న చింతనిప్పుల భిక్షపతి కుటుంబానికి అవకాశం కల్పించామని తెలిపారు. గతంలో ఎన్నో ఒత్తిడిలు వచ్చినప్పటికీ పార్టీ మారకుండా నిబద్ధతతో పనిచేశారని ఆమె కొనియాడారు. ములుగు మున్సిపాలిటీ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడని, చంద్రకళ భిక్షపతిలో చిత్తశుద్ధి, కమిట్‌మెంట్ ఉన్నాయని, పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నా రు. అవకాశం రానివారు నిరుత్సాహపడాల్సిన అవస రం లేదని, భవిష్యత్‌లో మంచి అవకాశాలు అందరికీ వస్తాయని భరోసా ఇచ్చారు. తనకు పార్టీలో అందరూ సమానమని మంత్రి స్పష్టం చేశారు. ములుగు మున్సిపాలిటీలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడానికి వెన్నుపోటు రాజకీయాలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరమని, అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. వెన్నుపోటు రాజకీయాలు ఎవరు చేశారో తమకు తెలుసని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దివంగత నల్లెల కుమార్ తనకు అన్నలాంటివారని పేర్కొంటూ, ఆయన కుమారుడు నల్లెల భరత్‌కు ఇంకా వయసు ఉందని, భవిష్యత్‌లో మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. ము లుగు మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికై న చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి, వైస్ ఛైర్మన్ ఆసియా షాహీన్‌తోపాటు కౌన్సిలర్లను మంత్రి సీతక్క శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, పీసీసీ కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెన్నుపోటు రాజకీయాలు సహించం
రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క


