మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం | - | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం

Feb 14 2026 9:09 AM | Updated on Feb 14 2026 9:09 AM

మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం

మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం

మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం

రామప్ప ఆలయ చైర్మన్‌ ఐలయ్య

వెంకటాపురం(ఎం): మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని రామప్ప ఆలయ చైర్మన్‌ ఐలయ్య తెలిపారు. మండలంలోని చారిత్రాత్మక గ్రామ దేవాలయానికి శుక్రవారం రామప్ప ఉత్సవ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అర్చకులు హరీష్‌ శర్మ, ఉమా శంకర్‌ల మంత్రోచ్ఛరణలా మధ్య పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్మన్‌ మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్కను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చైర్మన్‌ ఐలయ్యను స్థానిక కాంగ్రెస్‌ నాయకులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు శంకర్‌, రాజు, తిరుపతిరెడ్డి, వెంకటేశ్వర్లు, నర్సయ్య ,విజయ, కల్పనాదేవి, రాజీరు, వీరేష్‌, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement