కలెక్టర్ కార్యాలయంలోనే పెండింగ్..
డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయానికి వేతనాలు చెల్లించేందుకు ఫైల్‌ను పంపించినప్పటికీ ఇప్పటి వరకు వేతనాల బిల్ చేయకుండానే పక్కన బెట్టారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని భారాన్ని మోస్తున్న ఉద్యోగుల సమస్యలను తీర్చడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారు. అసలే ఉద్యోగులకు తక్కువ వేతనాల ఉన్నాయని, ఆ వేతనాన్ని కూడా నెలానెలా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని మండిపడుతున్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వేతనాల బిల్ చేసే ఇన్‌చార్జ్ వల్లనే వేతనాలు సకాలంలో రావడం లేదని ఉద్యోగస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా వైద్యశాఖలోని పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంటింజెంట్ ఉద్యోగుల వేతనాలు ఇవ్వాలని ఉద్యోగస్తుల కుటుంబాలు వేడుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ విషయాన్ని బయటకు చెప్పితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కొంతమంది అధికారులు బెదిరించడంతో ఉద్యోగస్తులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.


