హంసవాహనం ట్రయల్ రన్..
కాళేశ్వరం: శివరాత్రి సందర్భంగా ఈసారి కాళేశ్వరంలోని వీఐపీఘాటు వద్ద తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. తెప్పోత్సవానికి వీవీఐపీలు హాజరు కానున్న నేపథ్యంలో భద్రత చర్యల్లో భాగంగా శుక్రవారం ఈఓ మహేష్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి హంసవాహనంలో ట్రయల్ రన్ చేశారు. 15మంది నుంచి 20మంది వరకు ఆ హంసవాహనంలో ఆసీనులై గోదావరిలో జలవిహారం చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఎంత కెపాసీటీ వరకు ప్రయాణించాలనేది పోలీసులు అంచనా వేసుకున్నారు.


