ఉద్యమకారుడికి దక్కిన గౌరవం
ములుగు మున్సిపాలిటీలో ఉద్యమకారుడి కుటుంబానికి ప్రజలు పట్టం కట్టారు. జిల్లా సాధనకు కృషి చేసిన ఉద్యమకారుడు గండ్రకోట కుమార్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 9వ వార్డు నుంచి తన సతీమణి గండ్రకోట వాణిని బరిలో నిలిపాడు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ ములుగు జిల్లా సాధన ఉద్యమంలో ముందుండి పోరాడినందుకు గాను కాలనీవాసులు కుమార్ సతీమణి వాణికి పట్టం కట్టారు. 64 ఓట్లతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. ఫలితాల అనంతరం వార్డు పరిధిలో కాలనీవాసులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ నిర్వహిస్తున్న గండ్రకోట వాణికుమార్ దంపతులు


