కాంగ్రెస్‌ హవా | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ హవా

Feb 14 2026 9:09 AM | Updated on Feb 14 2026 9:09 AM

కాంగ్

కాంగ్రెస్‌ హవా

కాంగ్రెస్‌ హవా

మున్సిపల్‌ విజేతలు వీరే..

– 10లోu

ములుగు మున్సిపల్‌ తొలిపీఠం కాంగ్రెస్‌దే

ములుగు: ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే హవా కొనసాగింది. శుక్రవారం కలెక్టర్‌ టీఎస్‌ దివాకర ఆధ్వర్యంలో ములుగు డిగ్రీ కళాశాలలో పటిష్ట బందోబస్తు మధ్య కౌంటింగ్‌ ప్రారంభించారు. తొలిసారిగా ములుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ కై వసం చేసుకోనుంది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్‌ 12 వార్డులను గెలుచుకోగా బీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 1, ఇద్దరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు గెలుపొందారు.

నాలుగు ఓట్లతో గెలిచి..

19వ వార్డు అభ్యర్థి పౌడల ఓంప్రకాష్‌ కేవలం నాలుగు ఓట్లతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనుముల సురేష్‌పై గెలుపొందారు. వార్డులో మొత్తం 502 ఓట్లు పోలవగా 183 ఓట్లు సురేష్‌, 187 ఓట్లు ఓంప్రకాష్‌కు వచ్చాయి. ఇందులో బీజేపీ అభ్యర్థికి 124, 6 ఓట్లు చెల్లనివిగా గుర్తించగా, 2 ఓట్లు నోటాకు పడ్డా యి. అదేవిధంగా 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఇమ్మడి రాకేష్‌ యాదవ్‌పై 9 ఓట్ల మెజార్టీతో చింతనిప్పుల చంద్రకళ విజయం సాధించారు. రాకేష్‌కు 238 ఓట్లు పోలవగా, చంద్రకళకు 247 ఓట్లు పోలయ్యాయి.

చైర్‌పర్సన్‌ రేసులో స్వాతి, చంద్రకళ

తొలిసారి మున్సిపల్‌గా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవిని కాంగ్రెస్‌ కై వసం చేసుకోనుంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలవడంతో చైర్‌పర్సన్‌ సీటుకు మార్గం సుగమమైంది. 6వ వార్డు నుంచి గెలుపొందిన చింతనిప్పుల చంద్రకళ, 8వ వార్డు నుంచి గెలుపొందిన నల్లెల్ల స్వాతి చైర్‌పర్సన్‌ పదవిని ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వీరితో పాటు చైర్‌పర్సన్‌ పదవిని ఆశించిన వంగ సుమలత, బండారి నిర్మల ఓడిపోవడంతో స్వాతి, చంద్రకళ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈనెల 16న జరిగే చైర్‌పర్సన్‌ ఎన్నికలోపే అభ్యర్థిని మంత్రి సీతక్క ఖరారు చేయనున్నట్లు తెలిసింది.

గెలుపు సంబురాలు

ములుగు మున్సిపాలిటీ ఫలితాలు వెలువడిన అనంతరం గెలుపొందిన అభ్యర్థులు తమ పార్టీల నాయకులతో సంబురాలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ బాణాసంచా పేల్చారు. మున్సిపల్‌ పీఠాన్ని కౌవసం చేసుకునేందుకు గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థులు క్యాంపునకు వెళ్లినట్లు సమాచారం.

కౌంటింగ్‌కు పటిష్ట భద్రత

ములుగు మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను కట్టుదిట్టంగా నిర్వహించినట్లు కలెక్టర్‌ దివాకర టీఎస్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరిచి బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించారు. వార్డులకు పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో మొదట పోస్టల్‌ బ్యాలెట్స్‌ లెక్కించారు. అనంతరం సాధారణ బ్యాలెట్‌ పేపర్స్‌ కౌంటింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. కలెక్టర్‌తోపాటు ఎన్నికల జనరల్‌ పరిశీలకుడు గంగాధర్‌, అదనపు కలెక్టర్లు మహేందర్‌ జీ, సంపత్‌ రావు ఎప్పటికపుడు పర్యవేక్షించారు. ప్రతీ వార్డులో పోలింగ్‌ స్టేషన్ల వారీగా వచ్చిన బ్యాలెట్‌ పేపర్లను 25 చొప్పున కట్టలు కట్టి అభ్యర్థుల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గెలుపొందిన అభ్యర్థులకు సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందించారు.

20 వార్డుల్లో 12 వార్డులు

గెలుపొందిన కాంగ్రెస్‌

5 వార్డులతో సరిపెట్టుకున్న బీఆర్‌ఎస్‌

బోణికొట్టిన బీజేపీ,

2 సీట్లు గెలుచుకున్న ఇండిపెండెంట్లు

9వ వార్డులో ఉద్యమకారుడికి

దక్కిన గౌరవం

కాంగ్రెస్‌ హవా1
1/3

కాంగ్రెస్‌ హవా

కాంగ్రెస్‌ హవా2
2/3

కాంగ్రెస్‌ హవా

కాంగ్రెస్‌ హవా3
3/3

కాంగ్రెస్‌ హవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement