విద్యుత్ పనుల నాణ్యతలో రాజీలేదు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర సందర్భంగా చేస్తున్న విద్యుత్ పనుల నాణ్యతలో రాజీపడేది లేదని ఎన్పీడీసీఎల్ అపరేషన్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. శుక్రవారం మేడారంలో విద్యుత్ ఏర్పాట్ల పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ములుగు సర్కిల్ పరిధిలోని నార్లాపూర్‌లో కొత్తగా నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం మేడారంలో విద్యుత్ ఏర్పాట్ల పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈనెలఖారుకల్లా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. నాణ్యతలో ఎలాంటి రాజీపడవద్దని, భక్తులకు విద్యుత్ సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. జాతర విజయవంతం కావడానికి విద్యుత్ శాఖ కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. అందువల్ల ప్రతీపని నాణ్యతతో సమయానికి పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఈ ఆపరేషన్ రాజు చౌహన్, ములుగు ఎస్‌ఈ ఆనందం, డీఈ ఆపరేషన్ నాగేశ్వరరావు, ఏడీఈలు వేణుగోపాల్, సందీప్ పాటిల్ పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ మధుసూదన్


