ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ములుగు రూరల్: ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సార్వత్రిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని లీగల్ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికై నా లీగల్ సమస్యలు ఉంటే సమస్యల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్వామిదాస్, అడ్వకేట్ సుధాకర్, డాక్టర్ కపూర్, హేమంత్, ప్రేమ్‌సింగ్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్
మహేందర్


