తల్లి వార్డుమెంబర్..కొడుకు సర్పంచ్
కేసముద్రం: మండలంలోని మహముద్‌పట్నం గ్రామ వార్డుమెంబర్‌గా తల్లి, సర్పంచ్‌గా కొడుకు ఎన్నికయ్యారు. గ్రామంలో ఎస్టీ ఓటర్లు ఏడుగురు మాత్రమే ఉండగా, సర్పంచ్ స్థానంతో పాటు, మూడు వార్డులు ఎస్టీ రిజర్వేషన్ అయ్యాయి. దీంతో రెండు కుటుంబాలకు చెందిన వారే పోటీలో నిల్చున్నారు. ఈ మేరకు గురువారం గ్రామంలో ఎన్నికలు నిర్వహించగా, 3వ వార్డు మెంబర్‌గా పోటీ చేసిన తల్లి బుచ్చమ్మకు 33 ఓట్లురాగా, ఆమె ప్రత్యర్థికి కూడా 33 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు టాస్ వేశారు. దీంతో బుచ్చమ్మ విజయం సాధించింది. బుచ్చమ్మ కొడుకు కట్ల ఎల్లయ్య కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీలో నిలిచి గెలుపొందారు. దీంతో ఒకే ఇంట్లో తల్లి వార్డుమెంబర్‌గా, కొడుకు సర్పంచ్‌గా విజయం సాధించడం విశేషం.
తల్లి వార్డుమెంబర్..కొడుకు సర్పంచ్


