పోలింగ్ ప్రశాంతం
మండలాల వారీగా ఓటర్లు పోలింగ్ శాతం
78.65 శాతం నమోదు
ఏటూరునాగారం: జిల్లాలో ఏటూరునాగారం, ఎస్‌ఎస్ తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో గురువారం జీపీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతగా నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ సాగగా ఉదయం 7 గంటల నుంచి మందకొడిగా ప్రారంభమైంది. 9 గంటల తర్వాత ఓటర్లు బారలుదీరడంతో ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. కాగా జిల్లాలోని మూడు మండలాల్లో పోలింగ్ 78.65 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
చలితో ఉదయం పూట మందకొడిగా..
చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో గురువారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పోలింగ్ సరళి మందకొడిగా సాగింది. 9 తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ కనిపించింది. క్రమ క్రమంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. ఎన్నికల సిబ్బంది ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించి ఒంటిగంట వరకు ముగించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.
మహిళల ఓట్లే అధికం
గోవిందరావుపేట మండలంలో మొత్తం ఓట్లరు 20,402 ఉండగా 15,501 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఎస్‌ఎస్ తాడ్వాయిలో 16,680 మంది ఓటర్లు ఉండగా 13,928 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోగా ఏటూరునాగారం మండలంలో 23,279 మంది ఓటర్లు ఉండగా 18,043 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మూడు మండలాల్లో అత్యధికంగా మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు మండలాల్లో కలిపి 24,412 మంది మహిళలు ఓటు వేయగా 23,055 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకొని సత్తాచాటారు. క్యూలైన్లలో సైతం మహిళలు బారులుదీరి ఆహా అనిపించారు. 48 సర్పంచ్ స్థానాలకు గాను 9 ఏకగ్రీవం కాగా 420 వార్డు సభ్యులకు 128 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.
మండలం మొత్తం పోలైన పోలింగ్
ఓటర్లు ఓట్లు శాతం
ఏటూరునాగారం 23,279 18043 77.51
ఎస్‌ఎస్‌తాడ్వాయి 16,680 13,928 83.50
గోవిందరావుపేట 20,402 15,501 75.98
మూడు మండలాల్లో 60,361 ఓట్లకు 47,472 ఓట్లు పోలింగ్
ఉదయం మందకొడిగా సాగిన ఓటింగ్
పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం


