నేడే రెండో విడత పోలింగ్
ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం (ఎం) మండలాల్లో ఎన్నికలు
పోలింగ్ సామగ్రితో గ్రామాలకు బయలుదేరిన ఎన్నికల సిబ్బంది
వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సిబ్బంది
ములుగు రూరల్: రెండో విడత ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లో రెండో విడత ఎన్నికలు నేడు(ఆదివారం) నిర్వహించనున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తెలనుంది. మండల కేంద్రాల నుంచి ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఎన్నికల సామగ్రితో కేటాయించిన గ్రామాలకు బయలుదేరారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.
37 సర్పంచ్, 315 వార్డు స్థానాలకు..
ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లో మొత్తం 52 స్థానాలకు 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 462 వార్డు స్థానాలకు 147 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మూడు మండలాల్లో 37 సర్పంచ్, 315 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ములుగు మండలంలో 6 ఏకగ్రీవం కాగా 13, మల్లంపల్లిలో 4 స్థానాలు ఏకగ్రీవం కాగా 6 స్థానాలకు, వెంకటాపురం(ఎం)లో 5 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 18 స్థానాలకు, 315 వార్డు స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది.
ఎన్నికల సామగ్రితో బయలుదేరిన సిబ్బంది
రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు శనివారం ములుగు, వెంకటాపురం (ఎం) మండలకేంద్రాల్లో ఎన్నికల సామగ్రిని ఎంపీడీఓ ఆధ్వర్యంలో అందజేశారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రిని అందించి వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. మూడు మండలాల్లో మొత్తం పోలింగ్ అధికారులు 530, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు 653 మందిని కేటాయించారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్
37 సర్పంచ్‌లు, 315 వార్డు స్థానాల్లో ఓటింగ్
పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది
నేడే రెండో విడత పోలింగ్
నేడే రెండో విడత పోలింగ్


