పోలింగ్ కేంద్రాల పరిశీలన
ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి: మొదటి విడత జీపీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను గురువారం సాధారణ ఎన్నికల పరిశీలకుడు, జనరల్ అబ్జర్వర్ డి.ప్రశాంత్ కుమార్ గురువారం పరిశీలించారు. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం పరిధిలోని బీరెల్లి, రంగాపూర్, గంగారం, కాటాపూర్, దామరవాయి, కామారం పోలింగ్ కేంద్రాలతో పాటు, ఏటూరునాగారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్, చిన్న బోయినపల్లి, శివాపురం, తాళ్లగడ్డ, ఏకే ఘన్‌పూర్, ముళ్లకట్ట, రోహిర్, ఎక్కెల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లోని ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ రవీందర్, సీఐ శ్రీనివాస్, సీడీపీఓ ప్రేమలతను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహిస్తున్న పోలింగ్ సరళిని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్‌ను నిష్పక్షపాతంగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని నాయకులు, ఓటర్లు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రవీందర్, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రాజ్‌కుమార్, సురేశ్ ఉన్నారు.
అలాగే తాడ్వాయి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను గురువారం ఎస్పీ పరిశీలించారు. పోలింగ్ సరళి, శాంతి భద్రత వివరాలను తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డిని ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన


