నిబంధనల మేరకు ప్రచారాలు నిలిపివేయాలి
ములుగు రూరల్: ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రచారాలను నిలిపి వేయాలని కలెక్టర్ దివాకర గురువారం ఒక ప్రకటనలో సూచించారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగించాలని తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని వివరించారు. ఎన్నికలు జరిగే మండలాలలో 44 గంటల పాటు బహిరంగ ప్రచారం చేయరాదని సూచించారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.
ఎన్నికల సరళి పరిశీలన
మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కలెక్టరేట్‌లో గురువారం వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను కలెక్టర్ దివాకర పరిశీలించారు. మొదటి విడత ఎన్నికలు ఏటూరునాగారం, ఎస్‌ఎస్‌తాడ్వాయి. గోవిందరావుపేట మండలాల్లో నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ, కౌటింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఈడీ దేవేందర్ పాల్గొన్నారు.


