చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టాలి..
కూలిపోయిన చెక్‌డ్యాం స్థానంలో నూతన చెక్‌డ్యాం నిర్మించి వందలాది ఎకరాలకు నీరందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. చెక్‌డ్యాం పూర్తిగా కొట్టుకు పోవడంతో పంటలు పండించేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. సకాలంలో నీరందక పంటలు ఎండి పోతుండటంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. కలెక్టర్ స్పందించి ప్రభుత్వం ద్వారా చెక్‌డ్యాం నిర్మాణానికి నిధులు మంజూరు చేసి గిరిజన రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
బాడిశ నాగరమేశ్, బీఆర్‌ఎస్ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాజుపేట


