ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ములుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టరేట్ చాంబర్‌లో మొదటి విడత ఎన్నికలు జరగనున్న గోవిందరావుపేట, ఎస్‌ఎస్‌తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ దివాకర, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్‌కుమార్ సమక్షంలో మంగళవారం నిర్వహించారు. మొదటి విడత పోలింగ్‌కు సంబంధించి గ్రామాల వారీగా ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు వివరించారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికే ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలతో కూడిన గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరపాల్సిన అవసరం లేకపోవడంతో ర్యాండమైజేషన్ ప్రక్రియ నుంచి కొంతమంది సిబ్బందికి మినహాయింపు కల్పించినట్లు వివరించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందికి పోలింగ్ విధులు కేటాయించినట్లు వివరించారు. మొదటి విడతలో 379 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు ఉండగా, 20 శాతం అదనంగా సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచుతూ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ వివరించారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన
గోవిందరావుపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్‌రావుతో కలిసి పరిశీలించారు. పంపిణీ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు, సీల్ ట్యాగులు, స్టేషనరీ, పోలింగ్ బృందాల కిట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేలా చూడాలన్నారు. భద్రతా చర్యలు, రవాణా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు


